శ్రీశైలం వెళ్లే భక్తులకు మల్లన్న ఆలయ అధికారులు శుభవార్త అందించారు. భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు భక్తులకు స్పర్శ దర్శనాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులను ఆదేశాల మేరకు జిల్లా అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. రేపటి నుంచి ఐదు రోజుల పాటు అభిషేకం చేయించుకునే వారికి స్పర్శదర్శనం కల్పిస్తామన్నారు. అలాగే గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ఉచితంగా…