ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేటి నుండి ఈనెల 22 వరకు ఆర్జితసేవలలో పలు మార్పులు చేశారు దేవస్థానం అధికారులు. కార్తీకమాసం సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్షేత్రానికి తరలివచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీనికి తోడు కార్తీకమాసం చివరి వారం క్షేత్రాన్ని తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో దేవస్థానంలోని పలు ఆర్జితసేవలలో అధికారులు మార్పులు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీశైలంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న వాహనాల రద్దీ
Read Also: UK Economic Crisis: ఆర్థిక కష్టాల్లో బ్రిటన్.. 41ఏళ్ల గరిష్టానికి ద్రవ్యోల్బణం
ఇతర ఆర్జితసేవలైన అమ్మవారికి కుంకుమార్చన,చండీహోమం, రుద్రహోమం,శ్రీ స్వామిఅమ్మవార్ల కల్యాణం యథావిధిగా కొనసాగిస్తూ ఈ ఆర్జితసేవాకర్తలకు కూడా స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు తెలిపారు .అలాగే భక్తుల సౌకర్యార్థం రోజు రాత్రి 9 గంటలకు రూ.500 రూపాయల స్వామివారి స్పర్శదర్శనం గురు, శుక్ర, మంగళ,బుధవారం రోజులలో కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు శని, ఆది, సోమవారాలలో స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీశైలం వచ్చే భక్తులు ఈ మార్పును గమనించాలని దేవస్థానం అధికారులు సూచించారు.
Read Also: Strange Noises in Pedpadalli: పెద్దపల్లి జిల్లాలో రాత్రి వేళల్లో వింత శబ్దాలు..