Navjot Singh Sidhu Praises KL Rahul: టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌ను వాహన ‘స్పేర్ టైర్’తో పోల్చారు. అత్యవసర పరిస్థితుల్లో అతడిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చన్నారు. రాహుల్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ లేరని సిద్ధూ పేర్కొన్నారు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ నేపథ్యంలో నవ్‌జ్యోత్ సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.…