LSG vs GT: కేఎల్ రాహుల్ ‘స్పేర్ టైర్’ లాంటోడు.. సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navjot Singh Sidhu Praises KL Rahul: టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌ను వాహన ‘స్పేర్ టైర్’తో పోల్చారు. అత్యవసర పరిస్థితుల్లో అతడిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చన్నారు. రాహుల్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ లేరని సిద్ధూ పేర్కొన్నారు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ నేపథ్యంలో నవ్‌జ్యోత్ సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన చర్చలో నవ్‌జ్యోత్ సిద్ధూ మాట్లాడుతూ… ‘కేఎల్ రాహుల్ ఎన్నో ప్రశంసలకు అర్హుడు. రాహుల్ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అతడు వికెట్ కీపర్‌గా లేదా ఓపెనర్‌గా కూడా ఆడతాడు. జట్టులోని ఏ పాత్రనైనా పోషించగడు. జీప్ వెనుక ఎప్పుడూ ఒక టైర్ ఉంటుంది. అదే స్పేర్ టైర్. అత్యవసర పరిస్థితి లేదా పంక్చర్ అయినపుడు ఆ స్పేర్ టైర్‌ను వాడుకుంటాం. కేఎల్ రాహుల్ ఆ స్పేర్ టైర్ లాంటోడు. అందరికీ ఆ సామర్థ్యం ఉండదు’ అని అన్నారు.
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
Also Read: Allu Arjun: ఆ లెటర్ పూర్తిగా చదవలేదు.. కానీ ఆశ్చర్యపోయాను: అల్లు అర్జున్
కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2024లో ఎల్‌ఎస్‌జీకి నాయకత్వం వహిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ 28 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఎల్‌ఎస్‌జీ పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈరోజు లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో లక్నో తలపడనుంది. మొదటి రెండు సీజన్లలో రాహుల్ నాయత్వంలో ఎల్‌ఎస్‌జీ ప్లేఆఫ్‌కు చేరుకున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!