భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనతను సాధించింది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 ను స్వదేశం నుంచి ప్రయోగించింది. శ్రీహరికోటలో LVM3-M5 రాకెట్ ప్రయోగం చేపట్టారు. నింగిలోకి దూసుకెళ్తున్న LVM3-M5 రాకెట్. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి LVM3-M5 రాకెట్ దూసుకెళ్లింది. Also Read:Allu Arjun : అల్లు అర్జున్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్ 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని LVM3-M5 రాకెట్ ద్వారా జీసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్…
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికా నుంచి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
‘‘స్పేస్‌లో పరిస్థితులకు ఇప్పుడే అలవాటు పడుతున్నాం. అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా తినాలి అనే విషయాలను చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను ఒంటరి కాను.. నా భూజంపై త్రివర్ణ పతాకం ఉంది. అంటే.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారనే భావన నాకు కలుగుతోంది. రోదసియానంలో నాది చిన్న అడుగే కావొచ్చు. కానీ, భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు." అని శుభాంశు వ్యాఖ్యానించారు.
సునీతా విలియమ్స్ భూమిపై అడుగుపెట్టారు. స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగిన విషయం తెలిసిందే. ఆమె దిగిన వెంటనే.. ఆ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సూల్ చుట్టూ అనేక డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. ఈ డాల్ఫిన్లు చాలా సేపు క్యాప్సూల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఏదో చెప్పాలనుకుంటున్నట్లు అనిపించింది. ఈ అందమైన దృశ్యానికి సంబంధించిన వీడియో కూడా బయటపడింది.
తొమ్మిది నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు ఈ రోజు తెరపడింది. దివి నుంచి వ్యోమగాములు దివికి చేరుకున్నారు. దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తోపాటూ.. బుచ్ విల్మోర్ మరో ఇద్దరు వ్యోమగాములు.. విజయవంతంగా భూమిపై అడుగు పెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగు ప్రయాణమైన వాళ్లు.. భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారుజామున 3.27 నిమిషాలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఈ అంశంపై…
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే, కొత్త లాంచ్ తేదీ ఏమిటో ఇంకా స్పష్టంగా తెలియలేదు. సాంకేతిక లోపం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
North Korea : టెక్నాలజీ సాయంతో ఉత్తర కొరియా మరోసారి ప్రపంచాన్ని భయపెట్టడం ప్రారంభించింది. తమ తొలి గూఢచారి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపినట్లు ఉత్తర కొరియా అధికారులు తెలిపారు.
Chandrayaan-3 Launch: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఓ వైపు చంద్రయాన్-3 మిషన్ ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. దీనికి ముందు ప్రఖ్యాత అంతర్జాతీయ ఇసుక కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ చంద్రయాన్ 3 అద్భుతమైన ఇసుక కళను రూపొందించారు.