Cross Boarders: ‘వ్యాపారం చేయాలనే ఆలోచన, ఆసక్తి ఉంటే.. మేము మీ వెంటే’ అని క్రాస్ బోర్డర్స్ ఫౌండర్, ‘TIE’ చార్టర్ మెంబర్ సుబ్బరాజు పేరిచర్ల తెలిపారు. క్రాస్ బోర్డర్స్ అనేది ఎర్లీ స్టేజ్ స్టార్టప్ ఫౌండర్ల కోసం ఎకోసిస్టమ్‌ని రూపొందించే సంస్థ. TIE.. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఆర్గనైజేషన్. లాభాపేక్షలేని సంస్థ. సుబ్బరాజు పేరిచర్ల.. SPA ఎంటర్‌ప్రైజెస్‌కి పార్ట్నర్‌గా, అడ్వైజర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. SPA.. ఇదొక టెక్నాలజీ కంపెనీ. బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.