TIE Charter Member: వ్యాపారం చేయాలనే ఆలోచన, ఆసక్తి ఉంటే.. మేము మీ వెంటే: సుబ్బరాజు పేరిచర్ల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cross Boarders: ‘వ్యాపారం చేయాలనే ఆలోచన, ఆసక్తి ఉంటే.. మేము మీ వెంటే’ అని క్రాస్ బోర్డర్స్ ఫౌండర్, ‘TIE’ చార్టర్ మెంబర్ సుబ్బరాజు పేరిచర్ల తెలిపారు. క్రాస్ బోర్డర్స్ అనేది ఎర్లీ స్టేజ్ స్టార్టప్ ఫౌండర్ల కోసం ఎకోసిస్టమ్‌ని రూపొందించే సంస్థ. TIE.. గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఆర్గనైజేషన్. లాభాపేక్షలేని సంస్థ. సుబ్బరాజు పేరిచర్ల.. SPA ఎంటర్‌ప్రైజెస్‌కి పార్ట్నర్‌గా, అడ్వైజర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. SPA.. ఇదొక టెక్నాలజీ కంపెనీ. బ్రిటన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏడాది కిందట ఇండియాలోనూ సర్వీస్ మొదలుపెట్టింది. మిడ్ సైజ్ బిజినెస్‌ల కోసం సొల్యూషన్ బేస్డ్ అప్లికేషన్లను కోక్రియేట్ చేస్తోంది.
స్టార్టప్‌లకు ఎదురయ్యే అవాంతరాలను కార్పొరేట్ ఎక్స్‌లెన్స్‌తో అధిగమించటానికి, తద్వారా మిడ్ సైజ్ బిజినెస్‌లకు సొల్యూషన్స్‌ని కోక్రియేట్ చేయటానికి ఈ రెండు (క్రాస్ బోర్డర్స్ మరియు ఎస్‌పీఏ) కంపెనీలూ సంయుక్తంగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో రోబోటిక్ స్టార్టప్స్ మరియు నెట్‌వర్కింగ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి. అంతేకాదు. ఇండియాతోపాటు యూరప్‌లోని ట్రైనర్స్‌కి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ పోర్ట్‌ఫోలియో కంపెనీ ద్వారా పరిష్కార మార్గాలను సూచిస్తున్నాయి. క్రాస్ బోర్డర్స్ కంపెనీ ప్రస్తుతం ‘నా పంట’ అనే అగ్రిటెక్ స్టార్టప్‌తో మరియు రూరల్ లాజిస్టిక్స్ స్టార్టప్‌తో కలిసి పనిచేస్తోంది.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
ఇదిలాఉండగా.. తాను గత దశాబ్ద కాలంగా ఎడ్యుకేషన్, ఫిన్‌టెక్, మీడియా టెక్, హెల్త్‌టెక్ వంటి స్టార్టప్‌లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నట్లు సుబ్బరాజు పేరిచర్ల తెలిపారు. ‘నా పంట అనే అగ్రిటెక్ స్టార్టప్ వ్యవస్థాకుడు ఒక టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ని ఏర్పాటుచేశారు. ఇందులో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 2,50,000 మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. ఈ సంస్థను నెక్‌స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేందుకు అతనితో కలిసి పనిచేస్తున్నాం. తద్వారా మరింత రెవెన్యూని జనరేట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. అనంతపూర్‌కి చెందిన ఓ యువకుడు రూరల్ లాజిస్టిక్స్ కోసం లోకల్ ఎకోసిస్టమ్‌ని డెవలప్ చేస్తున్నాడు. అతనికి ఫండింగ్ చేస్తున్నాం.
అతను తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాలకు ఉత్పత్తులను డెలివరీ చేయటానికి లోకల్ మార్కెట్ ప్లేస్‌ను ఏర్పాటుచేస్తున్నాడు. బిజినెస్ ఐడియా.. స్కూల్ లెవల్ విద్యా్ర్థికి వచ్చినా TIE మెంటార్ పరిగణనలోకి తీసుకొని, దానికి ఒక మోడల్‌ని క్రియేట్ చేస్తుంది. దాని నుంచి ఇనీషియల్ ప్రొడక్ట్ వచ్చే వరకు సాయం చేస్తుంది. ఐడియాని గ్లోబల్ లెవల్‌కి కూడా తీసుకెళతాం. అవసరమైతే పెట్టుబడి పెడతాం. కాలేజ్, యూనివర్సిటీ స్థాయిలోనూ ఇది కొనసాగిస్తాం.
ఇలా మాకు గతేడాది 24 దేశాల్లోని 450 వర్సిటీల నుంచి వెయ్యికి పైగా ఐడియాలొచ్చాయి. అందులోని ది బెస్ట్ అనదగ్గ 3 ఐడియాలను ఫైనల్ చేశాం. వాటికి వంద నుంచి వెయ్యి డాలర్ల వరకు ప్రైజ్ మనీ కూడా అందింది’ అని సుబ్బరాజు పేరిచర్ల వివరించారు. TIE గ్లోబల్ సమ్మిట్-2022 ఈ ఏడాది డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనుండటం విశేషం.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!