SP Ranganath: ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో దర్యాప్తు అధికారి నల్గొండ మాజీ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఈ తీర్పుతో ఓ పోలీస్ దర్యాప్తు అధికారిగా గర్వపడుతున్నానని, సంతోషపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తు ఏకంగా ఏడేళ్ల పాటు సాగిందని, 1600 పేజీల ఛార్జ్‌షీట్ తయారు చేయడానికి తొమ్మిది నెలలు పట్టిందని ఆయన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నాలజీ ఎనాలసిస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్యాప్తు జరిగిందన్నారు. మొత్తం 67…
చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై నల్గొండ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఆయన ఆరోపణలు నిరాధారం అన్నారు. పోలీసులకు దురుద్దేశాలు ఆపాదించవద్దన్నారు. ఏవోబీలో గంజాయి సాగు అందరికీ తెలిసిందేనని, పక్కా సమాచారం మేరకే ఏవోబీలో దాడులు చేసినట్టు ఎస్పీ తెలిపారు. నల్గొండలో భారీగా గంజాయి పట్టుబడిందని గంజాయి నివారణకు అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ రంగనాథ్ అన్నారు. పోలీసులకు రాజకీయాలతో ముడి పెట్టవద్దన్నారు.