పెడన పోలీసు స్టేషన్ పరిధిలో తోటమూల సెంటరులో జనసేన బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేశారు అని కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. తన సభలో దాడులు జరుగుతాయని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.. అక్కడ పూర్తి విచారణ, పరిశీలన చేశాం.. పవన్ కేడర్ కు ఇచ్చిన సందేశం పైన పూర్తి పరిశీలన చేశాం.. పవన్ కళ్యాణ్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని ఆయనకు నోటీసు ఇచ్చామని ఎస్పీ పేర్కొన్నారు.