SP Charan Birthday special: గానగంధర్వుడుగా జనం మదిలో నిలచిన యస్.పి.బాలసుబ్రహ్మణ్యం వారసుడు యస్.పి.చరణ్ సైతం నాన్న బాటలోనే పయనిస్తున్నారు. గాయకునిగా, నటునిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా, సంగీతకళాకారుల పోటీలో న్యాయనిర్ణేతగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు బాలు. ఆయన చూపిన దారిలోనే చరణ్ సైతం సాగుతున్నారు. ఇప్పటికే నటునిగా, గాయకునిగా, నిర్మాతగా అలరించిన చరణ్, తన తండ్రిలాగే పాటల పోటీలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు. మునుముందు మరిన్ని ప్రక్రియల్లోనూ తన బాణీ పలికించి తండ్రికి తగ్గ తనయుడు…