ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు మంత్రి నారా లోకేష్.. విజయవాడలో సీఐఐ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా.. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడారు.. 70 మంది సీఈవోలు వచ్చిన ఈ సమావేశంలో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను అన్నారు..