దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయుడి సహా 20 మంది చనిపోయారు. దక్షిణ సూడాన్ రాజధాని జుబాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు చమురు క్షేత్రం సమీపంలో టేకాఫ్ అవుతుండగా విమానం కూలిపోయింది.
Poorest Countries: ప్రపంచంలో అత్యంత పేదదేశాలుగా ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) తలసరి జీడీపీ ఆధారంగా కొనుగోలు శక్తి సమానత్వం(పీపీపీ)ని హైలెట్ చేస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. జీడీపీ ఒక దేశం యొక్క మొత్తం ఆర్థిక ఉత్పత్తికి కొలమానంగా ఉంటే, పీపీపీ అనేది ప్రజల జీవన వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఆఫ్రికా దేశం దక్షిణ సూడాన్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా ఉంది. ఈ దేశ జీడీపీ తలసరి పీపీపీ 492.72 డాలర్లుగా ఉంది.…
దక్షిణ సూడాన్‌లోని తూర్పు జోంగ్లీ రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు జరిగిన జాతి పోరులో 56 మంది మృతి చెందారు. న్యూర్ కమ్యూనిటీకి చెందిన యువకులు మరొక జాతికి చెందిన వారిపై చేసిన దాడిలో చాలా మంది మరణించారని స్థానిక అధికారి మంగళవారం వెల్లడించారు.
ఒక్కో దేశంలో ఒక్కో రకంగా చట్టాలు ఉంటాయి. అక్కడి చట్టాలు కొన్ని మనకు వింతగానే అనిపిస్తుంటాయి. ఇటీవల ఓ గొర్రె ఒక మహిళను చంపినందుకు అరెస్ట్ చేసిన విషయం తెగ వైరల్ అయింది. తాజాగా ఇలాంటి ఘటనే మళ్లీ జరిగింది. ఒక బాలుడిని చంపినందుకు ఆవును అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఆఫ్రికా దేశం సౌత్ సుడాన్ లో జరిగింది. ఈ విచిత్రమైన ఘటనలో 12 ఏళ్ల బాలుడిని చంపిన ఆవును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో…
ఆఫ్రికాలో ఓ విచిత్రమై కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన తీర్పు మరింత ఫన్నీగా ఉంది. దక్షిణ సుడాన్ లో ఒక గొర్రె మహిళను చంపేసింది. దీంతో అక్కడి కోర్ట్ గొర్రె పిల్లకు మూడేల్లు జైలు శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే ఈ నెల ప్రారంభంలో దక్షిణ సుడాన్ లో 45 ఏళ్ల అదీయు చాపింగ్ అనే మహిళపై గొర్రె పిల్ల దాడి చేసింది. మహిళను గొర్రె తన తలతో పదేపదే కొట్టడంతో ఆమె పక్కటెముకుల…