దక్షిణాదిలో కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర శనివారంతో ముగిసింది. దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కరోనా కారణంగా ఈ ఏడాది జాతర ఉంటుందో లేదో అన్న అనుమానంతో మూడు నెలల ముందు నుంచే భక్తులు మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు రాకపోకలు సాగించారు. ఈనెల 16న జాతర ప్రారంభమయ్యే నాటికి 60 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నాలుగు రోజుల్లో 75 లక్షల మంది…