Nepal Protest: గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.
దేశం నుంచి తాము విడిపోతామని, స్వాతంత్రం కావాలంటూ బలూచిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌తో పోరాడుతున్నారు. ఓవైపు భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థలు పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. ఇలా ఇరువైపుల నుంచి తమపై దాడి జరుగుతుండగా.. పాక్ అల్లాడిపోతుంది. అయితే ఇదే సరైన సమయం అని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ భావిస్తోంది. బలూచిస్థాన్ ఇప్పటికే కీలక నగరం క్వెట్టా సహా చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి పాక్ ఆర్మీని…