బెంగాల్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ 24 పరగణాలులో పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో భారీగా బలగాలు మోహరించారు. అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కానింగ్‌లో అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. కాశ్మీర్, కోల్‌కతా పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో ఈ అరెస్టు జరిగింది. ఆదివారం అనుమానిత ఉగ్రవాదిని అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. జమ్మూ కాశ్మీర్ పోలీసుల డిమాండ్ మేరకు కాశ్మీర్‌లోని నిషేధిత 'తెహ్రీక్-ఎ-ముజాహిదీన్' సంస్థకు చెందిన అనుమానిత సభ్యుడు జావేద్ మున్షీని డిసెంబర్ 31 వరకు ట్రాన్సిట్ రిమాండ్‌కు కోర్టు పంపింది.
పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగింది. శనివారం జరుగుతున్న లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుండి చెదురుమదురు హింసాత్మక ఘటనలు మళ్లీ వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కుల్తాలి ప్రాంతంలో ఓ ఘటన వెలుగు చూసింది. ఇక్కడి పోలింగ్ బూత్‌లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజలను ఓటింగ్ చేయకుండా నిలిపివేశారని ఆరోపించారు. దీనికి…