Soumya Shetty: తెలుగు నటి సౌమ్య శెట్టిని పోలీసులు చోరీ కేసులో అరెస్ట్ చేశారు. తెలుగులో ది ట్రిప్, యువర్స్ లవింగ్లీ లాంటి సినిమాల్లో నటించిన సౌమ్య.. అవకాశాలు లేక అడ్డదారి తొక్కింది. డబ్బు కోసం ఒకరితో స్నేహం చేసి.. వారి ఇంటికే కన్నం వేసింది. వివరాల్లోకి వెళితే.. సౌమ్య విశాఖ పట్నంలోని రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి కుమార్తెతో మొదట పరిచయం పెంచుకుంది.