నాన్నా.. నన్ను రోజూ చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నారు. బయటకు రానివ్వడం లేదు.. నన్ను తిరిగి భారత్‌కు తీసుకువెళ్లు నాన్న అంటూ ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ యువకుడు ఫోన్‌లో తండ్రికి తన గోడును వెలిబుచ్చాడు.. బాధితుడి తల్లిదండ్రుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరుకు చెందిన కాలేషా, బీబీల కుమారుడు నజీర్‌బాషా డిసెంబర్‌లో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లారు.