Kamareddy: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పాపయ్య విజయం సాధించిన వెంటనే, ఆయన సోదరుడు చిరంజీవి గ్రామంలో వీరంగం సృష్టించాడు. తమపైనే పోటీ చేశారనే కక్షతో చిరంజీవి ప్రత్యర్థి అభ్యర్థి రాజు కుటుంబంపై ఏకంగా ట్రాక్టర్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనలో బాలమణి, భారతి, సత్తవ్వ, శారదలకు తీవ్ర గాయాలయ్యాయి, వారి పరిస్థితి విషమంగా ఉండటంతో…