జమ్మూకాశ్మీర్‌లోని ఉరిలో నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్థాన్ దళాలు చొరబాటుకు ప్రయత్నించాయి. దీంతో భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ ఎదురుకాల్పుల్లో భారతీయ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో రెండో రోజు ఉగ్రవాదులపై కాల్పులు కొనసాగుతున్నాయి. చత్రోలోని సింగ్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం పొందాడు.