Solar Power : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంట సాగుతో పాటు సౌర విద్యుత్ ఉత్పత్తిని అనుసంధానించేందుకు వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకంలో భాగంగా, రాష్ట్రంలోని రైతులకు తమ వ్యవసాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లూ ఈ వివరాలను వెల్లడించారు.…
స్వయం సహాయక సంఘాలకు మంత్రి సీతక్క గుడ్‌న్యూస్ చెప్పారు. సంఘాల్లోని మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్‌హెచ్‌జీలకు వెయ్యి మేగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలిపారు.
Solar Power Plants: ఆంధ్రప్రదేశ్‌లో 4,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు సోలార్ పార్కులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్రమే ప్రకటించింది.. ఇవాళ లోక్‌సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ఆర్కే సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.. ఏపీలో 4,100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు సోలార్ పవర్ ప్లాంట్లకు ఆమోదం…