Aditya L1: భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్1 తన లక్ష్యం దిశగా పయణమైంది. భూమి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో చక్కర్లు కోట్టిన శాటిలైట్ ఇప్పుడు భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటిసే సూర్యుడి దిశగా వెళ్తోంది. భారత మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 15 లక్షల కిలోమీటర్ దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్(L1) దిశగా వెళ్తోందని ఇస్రో మంగళవారం ప్రకటించింది. ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్((TL1I) విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది.
భారతదేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 కోసం శుక్రవారం కౌంట్‌డౌన్ ప్రారంభమైనందున, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. ఇది ఒక ముఖ్యమైన ప్రయోగమని, ఉపగ్రహం ఎల్ 1 (లాగ్రాంజియన్ పాయింట్ 1) పాయింట్‌ను చేరుకోవడానికి 125 రోజులు పడుతుందని చెప్పారు.
భారత్ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 ప్రారంభానికి కౌంట్‌డౌన్‌లు ప్రారంభమవుతున్న వేళ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం మాట్లాడుతూ.. మనం చంద్రుడిని చేరుకున్నామని, త్వరలో సూర్యుని దగ్గరికి చేరుకుంటామని చెప్పారు.
చంద్రుడిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడంతో ఇస్రో ఉత్సాహంగా ఉంది. చంద్రుడిపై సక్సెస్ సాధించిన ఇస్రో ఇప్పుడు సూర్యుని గురించి అధ్యయనం చేయడానికి ఒక వారంలోపు సోలార్ మిషన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.ఇస్రో సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 సోలార్ మిషన్‌ను ప్రారంభించనుంది.