Delhi-Mumbai Expressway: భారతదేశంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ హైవేను నేడు ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. తొలిదశలో భాగంగా నిర్మిస్తున్న సోహ్నా-దౌసా మధ్య నిర్మించిన రహదారిని ఆదివారం ప్రారంభించనున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ వేను ప్రాజెక్టును మొదలుపెట్టింది. 1,386 కిలోమీటర్లు పొడవైన ఈ రహదారి ఆర్థిక రాజధాని ముంబైని దేశరాజధాని ఢిల్లీని కలుపుతుంది. ఇది పూర్తయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణకాలం మరింతగా తగ్గతుంది. 180 కిలోమీటర్ల మేర దూరం తగ్గడంతో పాటు ఇప్పుడున్న 24…