ప్రజా రవాణాలో ప్రయాణిస్తున్నప్పుడు సీటును ముందుగా రిజర్వ్ చేసుకుంటాం. బస్సులు, రైళ్లల్లో ప్రయాణించినప్పుడు సీట్ల కోసం కుస్తీలు కూడా పడతారు. ఖాళీ సీట్లు లేకపోతే రద్దీగా ఉండే రైళ్లలో సుదీర్ఘ ప్రయాణం చేయడంతో చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. అయితే, రైలులో సీటు దొరక్కపోవడంతో విసిగిపోయిన ఓ వ్యక్తి తనతో పాటు సోఫాను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.