జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈతకు వెళ్ళి నదుల్లో, బావుల్లో ప్రమాదాలకు గురై కన్నవారికి కడుపుకోత, అయినవారికి కన్నీళ్ళు మిగులుస్తున్నారు. జనగామ జిల్లా యశ్వంత్ పూర్ లోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి మరణించడం విషాదం నింపింది. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల గోడదూకి దొంగతనంగా యశ్వంత్ పూర్ రైల్వే…