రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. టెక్నాలజీ పరంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సమ్మిళితమయ్యే సామాజిక ప్రభావాన్ని సృష్టించడంపై దృష్టి సారించి, సమాజానికి ఉత్తమమైన వాటిని చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు కీసర బాల వికాస క్యాంపస్‌లో సోషల్ స్టార్టప్ ఎక్స్‌పోను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరవింద్ ఐ కేర్ సిస్టమ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేష్…