Chennai Customs : ఇటీవల ఎయిర్ పోర్టులన్నీ స్మగ్లింగ్ లకు అడ్డాలుగా మారుతున్నాయి. విదేశాల నుంచి బంగారం, వెండి, డ్రగ్స్ లాంటివి అక్రమంగా రవాణా చేస్తూ చాలామంది పట్టుబడిన వార్తలు విన్నాం.
Chennai: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా కౌలాలంపూర్ నుంచి వచ్చి ఓ ప్రయాణికురాలి వద్ద ఏకంగా 22 పాములను గుర్తించారు. లగేజ్ బ్యాగుల్ని తనిఖీ చేస్తున్న క్రమంలో విషపూరితమైన పాములను అధికారులు గుర్తించారు. వీటిలో రకరకాల పాములు ఉన్నాయి. 10 అడుగులకు పొడవైన పాములను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.