ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టాంజానియాకు చెందిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకెళ్తున్నాడనే అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఆ వ్యక్తిని అధికారులు విచారించగా.. కొకైన్ క్యాప్సూల్స్ మింగినట్లు బయటపడింది. దీంతో.. అతనికి వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతను క్షేమంగా ఉన్నాడు. క్యాప్సూల్స్‌లో నింపిన మందు విలువను లెక్కించగా.. కోట్ల రూపాయల్లో ఉంది.
యువతే టార్గెట్ చేసుకుని పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు ఓ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్. అంతేకాకుండా పోలీసుల కళ్లు కప్పి డ్రగ్స్ ను సరఫరా చేయడంలో అతనికి మించిన స్మగ్లర్ లేడు. తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ రాందాస్ పోలీసులకు చిక్కాడు. అతనిని కృష్ణా జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Cocaine Smuggling : హైదరాబాద్ నగరంలో మరోసారి మాదక ద్రవ్యాలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా సిటీకి తరలిన డ్రగ్స్ ను పెద్ద ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలో పోలీసుల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన గంజాయి స్మగ్లర్లు వేగంగా నడుపుతూ చెక్ పోస్ట్ గేటును బైక్ తో కొట్టారు. ఈ ఘటనలో గంజాయి బ్యాగుతో పాటు కిందపడ్డ వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో అతడిని ఎస్.కోట ఆసుపత్రికి తరలించారు. బైక్ డ్రైవింగ్ చేస్తున్న దుండగుడు తప్పించుకున్నాడు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటి చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రమాద దృశ్యం సీసీటీవీ లో…