Cocaine Smuggling : హైదరాబాద్ నగరంలో మరోసారి మాదక ద్రవ్యాలు కలకలం సృష్టించాయి. ఇప్పటికే న్యూ ఇయర్ సందర్భంగా సిటీకి తరలిన డ్రగ్స్ ను పెద్ద ఎత్తున పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సంక్రాంతి పండుగ టార్గెట్ గా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న మరో వ్యక్తిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివారులో 180 గ్రాముల కొకైన్ ను తరలిస్తుండగా హయత్ నగర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన వ్యక్తి నగరంలో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
Read Also: Manikrao Thakre : రెండ్రోజుల్లో హైదరాబాద్ కు కాంగ్రెస్ కొత్త ఇన్ ఛార్జి
హయత్ నగర్ పోలీసులు పట్టుకున్న డ్రగ్స్ విషయమై ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ సరఫరా చేస్తుండగా నైజీరియన్ ను పట్టుకున్నామన్నారు. అతడి దగ్గరనుంచి 18 లక్షల రూపాయల విలువైన 178 గ్రాములు కొకైన్ స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు.. నైజీరియాకు చెందిన పెడ్లర్ బాడ్విన్ ఎఫియంగే.. వనస్థలిపురంలోని హుడా పార్క్ వద్ద తచ్చాడుతుండగా పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. ఇతను డ్రగ్స్ అమ్ముతున్నాడని సమాచారంతో అతడి గురించి వెతకడం ప్రారంభించామన్నారు. ఈ వ్యక్తి గ్రాము కొకైన్ పదివేల రూపాయలకు అమ్ముతున్నాడని.. బెంగళూరు నుంచి కొకన్ ని తీసుకువచ్చినట్టుగా విచారణలో తేలిందన్నారు.
Read Also: Richest Cat: ఆ పిల్లి ఆస్తి రూ.800కోట్లు.. ప్రపంచంలోనే రిచస్ట్ పెట్ యానిమల్
గతంలో ధూల్ పేట్లో కుక్కర్ అమ్ముతూ పట్టుపడ్డాడు.. ఫేక్ పాస్పోర్టు ఫేక్ వీసా ఫేక్ ఆధార్ గ్రూపులను కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.. గతేడాది పట్టుబడినప్పుడు మోసీక్ పేరుతో ఘనా దేశస్తుడిని చెప్పినట్లు.. నకిలీ ధృవ పత్రాలతో దాదాపు 400 సిమ్ కార్డులను ఇప్పటివరకు మార్చాడని పోలీసుల దర్యాప్తులో తేలిందన్నారు.. అధికారిక వీసాలో మాత్రం ఇతడు భారత్ కు బి ఫార్మసీ చేయడానికి వచ్చిన్నట్లుగా ఉందన్నారు.. నకిలీ పాస్పోర్ట్ లో మాత్రం బీటెక్ స్టూడెంట్ గా ఉన్నట్లు గుర్తించారు. ఇతడు జంట నగరాల్లోని విద్యార్థులే టార్గెట్ గా కొకైన్ సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.