టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం రద్దైన విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ను నవంబర్ 23న స్మృతి వివాహం చేసుకోవాల్సి ఉండగా.. ఊహించని రీతిలో పెళ్లికి కొన్ని గంటల ముందు వాయిదా పడింది. స్మృతి తండ్రి శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించడంతో పెళ్లి వాయిదా పడిందని, పలాష్ కూడా అనారోగ్యానికి గురయ్యాడని, డిసెంబర్ 7న ఇద్దరి వివాహం జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. డిసెంబర్ 7 మధ్యాహ్నం స్మృతి సోషల్…