Smoking Beedi On Flight: విమానంలో మొదటిసారిగా ప్రయాణిస్తున్న వ్యక్తి, నిబంధనలు తెలియక బీడీ తాగాడు. దీంతో అరెస్ట్ అయ్యాడు. అహ్మదాబాద్ నుంచి బెంగళూర్ వెళ్తున్న ఆకాశ ఎయిర్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్ మార్వార్ ప్రాంతానికి చెందిన 56 ఏళ్ల ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి మంగళవారం అహ్మదాబాద్‌లో విమానం ఎక్కాడు. విమానం గాలిలో ఉండగా.. మరుగుదొడ్డికి వెళ్లిన అతను అక్కడ బీడీ తాగాడు.