స్మార్ట్‌ఫోన్స్ వచ్చాక ‘నోకియా’ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అందరికీ తెలుసు. ఇతర కంపెనీలకు పోటీ ఇవ్వలేక పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి షిఫ్ట్ అయిన నోకియా.. మళ్లీ దూకుడు పెంచింది. ఇతర సంస్థలకు పోటీగా బడ్జెట్ ధరల్లోనే అదిరిపోయే ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్స్‌ని విడుదల చేస్తోంది. ఇప్పుడు తాజాగా లో-బడ్జెట్‌లో నోకియా సీ21 ప్లస్ మొబైల్‌ని లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ మొబైల్ రిలీజయ్యింది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ మొబైల్…
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలైన ఒప్పో,వన్‌ప్లస్‌లకు ఊహించని షాక్ తగిలింది. ఓ విషయమై నోకియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జర్మనీలోని మాన్‌హీమ్ కోర్టు.. ఆ రెండు కంపెనీలపై వేటు వేసింది. నోకియాకి అనుకూలంగా తీర్పునిస్తూ.. ఆ దేశంలో ఒప్పో, వన్‌ప్లస్ ఫోన్‌లను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే.. 5జీ నెట్‌వర్క్‌లోని పలు టెక్నాలజీలపై ‘నోకియా’ పేటెంట్ కలిగి ఉంది. అయితే.. వాటిల్లోని ఓ టెక్నాలజీని ఒప్పో, వన్‌ప్లస్ సంస్థలు ‘నోకియా’ అనుమతి…
స్మార్ట్ ఫోన్స్ వినియోగం పెరిగాక పిల్లలమీద ఒక కన్నేసి వుంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్ గేమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు, వైద్యులు మొత్తుకుంటున్నా వారిలో మార్పు మాత్రం రావడం లేదు. లాక్ డౌన్‌తో ఇళ్లకే పరిమితం కావడంతో గేమ్స్ పిచ్చిలో పడి.. పిల్లలు ఇప్పుడు బయటకు రాలేకపోతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ చేతిలో పట్టుకుని అదే మాయలో ఉంటున్నారు.అనంతపురం జిల్లాలో పబ్జీకి బానిసై అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడో బాలుడు. ఈ గేమ్‌కు బానిసైన…
రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్‌లు, స్కూటీలు ఇస్తామని ప్రియాంక గాంధీ తెలిపారు. డిగ్రీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, 12వ తరగతి పాసైన విద్యార్థులకు స్మార్ట్ ఫోన్‌లు ఇస్తామన్నారు. ఇప్పటికే మహిళలకు 40శాతం టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏండ్లుగా కోల్పోయిన అధికారన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలోని లేని పరిస్థితి ఉంది. దీంతో ఈ సారి ఎలాగైనా ఉత్తరప్రదేశ్ లో పాగా వేయాలని చూస్తోంది.…