స్మార్ట్‌ఫోన్స్ వచ్చాక ‘నోకియా’ పరిస్థితి ఎంత దిగజారిపోయిందో అందరికీ తెలుసు. ఇతర కంపెనీలకు పోటీ ఇవ్వలేక పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి షిఫ్ట్ అయిన నోకియా.. మళ్లీ దూకుడు పెంచింది. ఇతర సంస్థలకు పోటీగా బడ్జెట్ ధరల్లోనే అదిరిపోయే ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్స్‌ని విడుదల చేస్తోంది. ఇప్పుడు తాజాగా లో-బడ్జెట్‌లో నోకియా సీ21 ప్లస్ మొబైల్‌ని లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ మొబైల్ రిలీజయ్యింది.
3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ మొబైల్ ధర రూ.10,299 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,299. నోకియా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు. జియో కస్టమర్లకు రూ. 4,000 విలువైన బెనిఫిట్స్‌తో పాటు 10 శాతం డిస్కౌంట్ కూడా లభించనుందని నోకియా ఇండియా వెల్లడించింది. అంటే.. రూ. 1,000 వరకు తగ్గింపు పొందవచ్చు అన్నమాట! మరో బంపరాఫర్ ఏమిటంటే.. ఈ స్మార్ట్‌ఫోన్ కొన్నవారికి రూ.299 విలువ చేసే నోకియా వైర్డ్ బడ్స్ ఉచితంగా లభిస్తాయి.
6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్.. యూనిసోక్ SC9863A చిప్‌సెట్‌తో వర్క్ అవుతుంది. వెనుకవైపు 13మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కలిగిన ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 5,050ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వార్మ్ గ్రే, డార్క్ సియాన్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి.