కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని టెక్ హబ్ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన షెన్‌జెన్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒకవేళ షెన్‌జెన్‌లో లాక్‌డౌన్ విధిస్తే.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను సరఫరా చేసే నగరాల్లో షెన్‌జెన్ ఒకటి. అక్కడి నుంచే 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు…
రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నది. రెండు దేశాల మధ్య యుద్ధమే అయినప్పటికీ దాని ప్రభావం ప్రపంచ దేశాలపై తీవ్రస్థాయిలో పడింది. ఇప్పటికే కరోనా కారణంగా పెద్ద మొత్తంలో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని మరింత అతలాకుతలం చేసింది. ఈ యుద్ధం కారణంగా ఆయిల్, నిత్యవసర ధరలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, స్మార్ట్ ఫోన్లు, ఈవీ వాహనాల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.…
తెలంగాణలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ఆశావర్కర్లకు మొబైల్స్ ఆందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.…
స్మార్ట్ ఫోన్లను లాక్ చేయడానికి చాలా మంది ఫింగర్ ప్రింట్‌లను వినియోగిస్తుంటారు. ఫింగర్ ప్రింట్ కోసం సెన్సార్ స్క్రీన్ కింది భాగంలో ఉంటుంది. లేదంటే ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది. అయితే, స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ మరో అడుగు ముందుకు వేసి కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. టచ్ స్క్రీన్ మొత్తాన్ని స్క్రానర్‌గా మార్చేసింది. స్క్రీన్‌పై ఎక్కడ టచ్ చేసినా ఫోన్ అన్‌లాక్ అవుతుంది. దీనికి సంబంధించి పేటెంట్ కోసం ఇప్పటికే షావోమీ సిద్దమైంది.…
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది యూపీలో నేతలు అప్పుడే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వాలు మొదలెట్టేశారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం ఇప్పటికే ఎన్నికల ర్యాలీలు, సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్‌కు కీలకం కావడంతో ఎవ్వరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రలోభాలకు తెరలేపింది. యూపీ సీఎం యోగి…
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి పార్టీకి పునర్వైభవం తీసుకురావాలి చూస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో మహిళల ఓట్లు ఎవరికైతే పడతాయో వారు విజయం సాధించే అవకాశం ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ మహిళా ఓటర్లను ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదనంగా మరికోన్ని వరాలను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో…
కరోనా తెచ్చిన అనేక మార్పుల్లో ఆన్ లైన్ లర్నింగ్ కూడా ఒకటి. స్కూలుకి వెళ్లాల్సిన పిల్లలు ఇంట్లోనే ఉండిపోవటంతో స్మార్ట్ ఫోన్ ల ద్వారా స్మార్ట్ ఎడ్యుకేషన్ తప్పనిసరి అవుతోంది. కానీ, దేశంలో ఇంకా చాలా మంది పేద విద్యార్థులకి స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో లేవు. అందువల్ల వాళ్లు ఆన్ లైన్ శిక్షణకి దూరమవుతున్నారు. ఇకపై దూరవిద్యకి పేద విద్యార్థులు దూరం కావద్దని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ సరికొత్త కార్యక్రమానికి తెర తీసింది. ఎవరి వద్దనైతే…