కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతకు నిబంధనలకు నీళ్లు వదిలారు.. స్మార్ట్ సిటీ పనుల నిర్వహణకు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు తీసుకుంటారు.
హైదరాబాద్, వరంగల్ తరవాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కరీంనగర్. కానీ అక్కడ నిఘా వ్యవస్థ మాత్రం అంతంతమాత్రం. ఇక ట్రాఫిక్ కష్టాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరీంనగర్‌లో పరిస్థితి నగరవాసులకు నరకం చూపిస్తోంది. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో కరీంనగర్ ఒకటి. ఇప్పటికే స్మార్ట్ సిటీ నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే…! కానీ సిటీలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తాయి ముఖ్యంగా ట్రాఫిక్ కష్టాలు సాధారణంగా లేవు. వాహన…