ప్రస్తుతం సోషల్ మీడియాలో 'డిజిటల్ మోడల్' చిత్రాలు వైరల్ అవుతున్నాయి. మనకు తగినంత నిద్ర లేకపోతే 2050 నాటికి మనుషులు ఎలా ఉంటారో ఆ చిత్రాల ద్వారా చెబుతున్నారు. బ్రిటిష్ కి చెందిన స్లీప్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ సోఫీ బోస్టాక్ సహాయంతో బెన్సన్స్ ఫర్ బెడ్స్ అనే సంస్థ.. ఈ పరిశోధన చేసింది. స్త్రీ శరీరం సాధారణంగా రాత్రికి ఆరు గంటలపాటు నిద్రపోతే ఆమె 25 ఏళ్లలో ఎలా మార్పు చెందుతోందో డిజిటల్ చిత్రాల ద్వారా తెలిపారు.