గురువారమే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే మధ్యంతర బడ్జెట్‌పై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం దేశ ప్రజల కళ్లన్నీ నిర్మలాసీతారామన్ బడ్జెట్‌పైనే ఉన్నాయి. పైగా త్వరలోనే అతి పెద్ద ఎన్నికల జాతర జరగబోతుంది. కొద్దిరోజుల్లోనే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండడం.. పైగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు మోడీ సర్కార్ సన్నద్ధమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడ్జెట్ ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారులు చాలా ఆశలు పెట్టుకున్నారు.…