Skoda Kylaq: స్కోడా ఇండియా ప్రతిష్టాత్మకంగా ‘‘కైలాక్’’ని భారతీయ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ సెగ్మెంట్‌లో స్కోడా కైలాక్ రాకతో మరింత పోటీ పెరుగనుంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటివి ఉన్నాయి. ఇప్పుడు కైలాక్ ఎంట్రీ ఇవ్వబోతోంది.