"ధూమపానం ఆరోగ్యానికి హానికరం." ఈ హెచ్చరికలు తరచుగా వింటుంటాం. చదువుతూ ఉంటాం. కానీ చాలా మంది ధూమపానం ఊపిరితిత్తులకు మాత్రమే హానికరం అని నమ్ముతారు. ధూమపానం (స్మోకింగ్ సైడ్ ఎఫెక్ట్స్) మీ ఊపిరితిత్తులపై చెడు ప్రభావాలను కలిగి ఉండటమే కాకుండా.. అనేక ఇతర మార్గాల్లో కూడా మీ ఆరోగ్యానికి ప్రాణాంతకం మని నిపుణులు చెబుతున్నారు.
స్మోకింగ్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీసే వందలాది రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఇంది అందరికీ తెలిసిన విషయమే.. కానీ తక్కువ మందికే తెలిసిందేంటంటే.. స్మోకింగ్ తో చర్మ సమస్యలు వస్తాయని. స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది.