DCCB Director Kidnap: నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పరిధిలో పొనకల్ గ్రామంలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు చిక్యాల హరీష్ కుమార్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి ఇంట్లోకి చొరబడి బంగారం, నగదుతో పాటు వాహనం దొంగలించిన కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.