తిరుమల లడ్డూ వ్యవహారంపై కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది.
CM Chandrababu: తిరుమలలో జరిగిన అపచారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొ్న్నారు. అపచారం ఎవరి వల్ల జరిగింది..? ఎందుకు జరిగిందనే అంశంపై విచారణ చేసి సిట్ నివేదిక ఇస్తుందన్నారు. టీటీడీలో జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా రేపు హోమం చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో.అక్కడి సంప్రదాయం ప్రకారం శుద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. Read Also: AP CM…