కోనేరు కోనప్ప..సిర్పూర్ టీ మాజీ ఎమ్మెల్యే. ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారాయన. ఆ తర్వాత బీఎస్పీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకుని మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో... కూడా... బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయాక పాత గూడు కాంగ్రెస్ దరికే చేరారు కోనప్ప. కానీ.... చేరినప్పటి నుంచే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటున్నారాయన. ఆ క్రమంలో మెల్లిగా నియోజకవర్గంలో ప్రాధాన్యత కూడా తగ్గుతూ వస్తోందట. ఇలాంటి పరిస్థితుల్లో...…