ఫిలించాంబర్‌లో సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిరంజీవి చిత్రపరిశ్రమకు సిరివెన్నెల లేని లోటు తీరనిది. ఎవరూ కూడా భర్తీ చేయలేనిది అన్నారు. సమాజాన్ని మేలుకొలిపే, సమాజం ఆలోచింపజేసేలా ఆయన మాటలు పాటలు ఉండేవి. కొద్ది రోజుల క్రితమే తన అనారోగ్య సమస్యలు తెలుసుకుని చెన్నై వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుందాం అని చెప్పాను. నేను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత చెన్నై వెళ్దామని సిరివెన్నెలకు చెప్పాను. ఇంతలోనే ఇలాంటి వార్త వింటామని ఊహించలేదు. కిమ్స్ హాస్పిటల్…
ఈరోజు ఉదయం సిరివెన్నెల పార్థివదేహన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కు చేర్చారు. అక్కడ ఆయన అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం సిరివెన్నెలకు కడసారి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో సిరివెన్నెల పార్థివదేహానికి టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నివాళులు అర్పించారు. గత రెండు సంవత్సరాల నుంచి సిరివెన్నెల గారితో నాకు అనుబంధం ఉంది. సమాజాం పట్ల చాలా గౌరవం కలిగిన వ్యక్తి. నేను ఈ వారంలోనే ఆయనను కలవాలి అనుకున్నాను. కోవిడ్ సమయంలో పోలీసులు…
అశేష తెలుగు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తూ మరో తెలుగు దిగ్గజం సిరివెన్నెల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల పార్థివదేహాన్నిమధ్యాహ్నం వరకు అక్కడ ఉంచి 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. Read Also : సిరివెన్నెల పార్థీవదేహం వద్ద కన్నీరుమున్నీరైన తనికెళ్ళ తాజాగా…
లెజెండరీ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. 66 ఏళ్ల గీత రచయిత ఆకస్మిక మరణ వార్త తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు సీతారామశాస్త్రికి నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల 1984లో జననీ జన్మభూమితో అరంగేట్రం చేశారు. కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘సిరివెన్నెల’ చిత్రంలో ‘విధాత తలపున..’ పాటతో కీర్తిని పొందారు. శాస్త్రి దాదాపు 3000 పాటలకు సాహిత్యం అందించారు. ఇప్పటికే ఆయన మృతికి రాష్ట్రపతి రామ్…
గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి తెలుగు చిత్ర పరిశ్రమలో తీరని విషాదాన్ని నింపింది. అయితే న్యూమోనియాతో బాధపడుతున్నా సిరివెన్నెల ఈ నెల 24న చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే సిరివెన్నెల మరణం పట్ల సినీ ప్రముఖులు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. మోడీ తన ట్విట్టర్…
పద్మశ్రీ సిరివెన్నెల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే అప్పటి నుండి నిపుణుల వైద్య బృందం చికిత్స చేశారు. ఈ రోజు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం కన్నుమూశారు. అయితే సిరివెన్నెల మరణం సినీపరిశ్రమకు తీరని లోటు అని నారా భువనేశ్వరి అన్నారు. సీతారామశాస్త్రి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు. ఇక ఈ మధ్యే ఏపీలో…
తనదైన శైలితో తెలుగువారిని విశేషంగా అలరించిన గీత రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి శాశ్వతంగా కలం మూసేశారు. తెలుగు సినిమా పాటలతోటలో సీతారామశాస్త్రి వాణి, బాణీ ప్రత్యేకమైనవి. ‘సిరివెన్నెల’ సినిమాలో అన్ని పాటలూ పలికించి, జనాన్ని పులకింప చేసిన సీతారామశాస్త్రి, ఆ సినిమా టైటిల్ నే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగా జేజేలు అందుకున్న ఆయన కొద్ది రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నిమోనియాతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచీ వెంటిలేటర్ పై ఉన్న సీతారామశాస్త్రి…
సిరివెన్నెల ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. సిరివెన్నెల ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, నిపుణులైన వైద్యులతో సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైద్యం అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు తెలిపారు. సిరివెన్నెల ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలియజేశారు. న్యూమోనియాతో బాధపడుతూ సిరివెన్నెల ఈనెల 24 వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సిరివెన్నెల సినిమాలో సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఫేమస్ అయ్యారు. సిరివెన్నెల త్వరగా కొలుకొని తిరిగి మంచి పాటలు రాయాలని తెలుగు చిత్రపరిశ్రమ…