1986లో ‘సిరివెన్నెల’ చిత్రానికి అన్ని పాటలూ రాస్తూ, తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు సీతారామశాస్త్రి. 2021 నవంబర్ 30న ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. చిత్రం ఏమంటే… ‘సిరివెన్నెల’తో మొదలైన ఆయన సినీ గీత ప్రస్థానం తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ కోసం రాసిన పాటలో సిరివెన్నెల ప్రస్తావనతో ముగిసింది. నాని, సాయిపల్లవి జంటగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం.…