Mohammed Siraj: ఇంగ్లండ్‌పై ఐదో టెస్ట్‌లో భారత జట్టు అద్భుత విజయానంతరం, పేసర్ మహ్మద్ సిరాజ్ వ్యక్తిగత మోటివేషన్ ముచ్చటను మీడియాతో పంచుకున్నాడు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సిరాజ్.. చివరి రోజు ఉదయాన ‘బిలీవ్ (Believe)’ అనే పదాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసి, దొరికిన ఫోటోను తన ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నట్లు తెలిపాడు. అదే తనకు ప్రేరణగా మారిందని పేర్కొన్నాడు. ఇంకా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతను మాట్లాడుతూ.. నిజంగా అద్భుతంగా అనిపిస్తోంది. మొదటి రోజు…