అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై సింగపూర్ పోలీసులు కీలక సమాచారాన్ని అందించింది. జుబీన్ గార్గ్ మరణం విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాలు కనిపించలేదని.. దర్యాప్తు జరుగుతోందని సింగపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సిట్ దర్యాప్తునకు ఆదేశించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి సూచించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) హఠాన్మరణం చెందారు. సింగపూర్‌లో జరిగే నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం బోటుపై షికారు చేస్తుండగా ప్రమాదానికి గురైంది. లైఫ్ జాకెట్ ధరించకపోవడంతో నీళ్లలో శవమై కనిపించారు.