అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత, బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి, కో-సింగర్ అమృత్‌ప్రవ మహంతను అరెస్ట్ చేశారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మృతి కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే జుబీన్ గార్గ్ మేనేజర్, ఉత్సవ్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై హత్య కేసు నమోదు చేశారు. తాజాగా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మృతిపై సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా జుబీన్ గార్గ్ మేనేజర్ సిద్ధార్థ శర్మ, ఉత్సవ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంతలను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తు బృందం 14 రోజుల కస్టడీకి తీసుకుంది. సిద్ధార్థ శర్మ, శ్యామ్‌కాను మహంతలపై హత్యా అభియోగాలు నమోదయ్యాయని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఓ ఈవెంట్ కోసం జుబీన్ గార్గ్ సింగపూర్ వెళ్లారు. అయితే ఈవెంట్ నిర్వాహకులు జుబీన్ గార్గ్‌ను సముద్రంలోకి బోటింగ్‌కు తీసుకెళ్లారు. జుబీన్ గార్గ్ అప్పటికే నీరసంగా ఉన్నట్లు కనిపించారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. కమర్కుచి ఎన్‌సీ గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. ఇక కడసారి చూపు కోసం లక్షలాది మంది ప్రజలు తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్‌కు మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. జుబీన్ గార్గ్ మరణంపై పెద్ద ఎత్తున అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జుబీన్ గార్గ్ భార్య అనుమతితో రీపోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
జుబీన్ గార్గ్.. అస్సామీ గాయకుడు. అస్సామీ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక మంది హృదయాలను గెలిచిన గాయకుడు. నిన్నామొన్నటిదాకా అంతగా పరిచయం లేని జుబీన్ గార్గ్. ఆయన మరణం తర్వాత.. ఆయన కోసం తరలివస్తున్న జనాలను చూస్తుంటే.. ప్రజల్లో గుండెల్లో ఎంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారో అర్థమవుతోంది.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణం ఆయన అభిమానులను తీవ్ర శోకంలో ముంచేసింది. తన గానంతో అస్సాం ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. అలాంటిది ఒక్కసారిగా హఠాన్మరణం చెందడం ఆయనను ప్రేమించేవారు.. అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది.