Neha Singh Rathore: వివాదాస్పద ఫోక్ సింగర్ నేహా సింగ్ రాథోడ్ మరోసారి వివాదంలో నిలిచారు. ముఖ్యంగా, ఈమె బీజేపీ వ్యతిరేకతకు మారుపేరుగా ఉన్నారు. తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ గురించి తన వీడియోలో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో నేహాసింగ్‌పై మళ్లీ కేసు నమోదైంది. సామాజిక సంస్థ సాధన ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ సౌరభ్ మౌర్య దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా వారణాసిలోని సిగ్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.