ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు ఎ. ఎం. రాజా 1929 జూలై 1వ తేదీ చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో మన్మథరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. పచ్చయప్ప కళాశాల నుండి 1951లో బి. ఏ. పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మాస్టర్ నటరాజన్ వద్ద సంగీతాభ్యాసం పొందిన ఎ. ఎం రాజా కళాశాలలో చదివేటప్పుడే ఎన్నో పాటల పోటీలలో పాల్గొని బహుమతులను పొందారు. తమిళంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో ‘సంసారం, సంసారం’ రాజా పాడిన మొట్ట మొదటి సినిమా పాట.…