సింగరేణి కార్మికులకు ఇన్ కాం టాక్స్ రద్దు చేయాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలో మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు.
అంత కాదు.. ఇంతన్నారు. పెద్ద సంఘాలన్నీ యుగళగీతం పాడాయి. మూడు రోజులు సమ్మెలో ఐక్యత చాటాయి. మరి.. వారి పోరాటం ఫలించిందా? లేక వాళ్లదంతా ఆరాటమేనా? సమ్మె లక్ష్యం ఏమైంది? కార్మికుల్లో పల్చన కాకూడదనే సంఘాలు సమ్మెకు వెళ్లాయా? కలిసి వస్తే సరే.. లేదంటే ద్రోహులే..! సింగరేణిలో మూడు రోజుల సమ్మెకు ముందు జరిగిన ప్రచారం. సింగరేణిలో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికలోకం ఉద్యమించింది. ఉద్దేశం ఎలా ఉన్నా.. గుర్తింపు సంఘం చేసిన హడావిడి.. అనుసరించిన…
హైదరాబాద్‌లోని రీజినల్ లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యంతో సింగరేణి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో పాటు… కార్మికుల ప్రధాన డిమాండ్లపై ఆర్‌ఎల్‌సీ, సింగరేణి అధికారులతో జేఏసీ నేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులు సింగరేణికే ఇవ్వాలని, ఇతర 12 డిమాండ్ల పై చర్చించడానికి చొరవ చూపాలని సూచించారు. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మె చేసి తీరుతామని…
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా పేరున్న సింగరేణి కాలరీస్ ప్రమాదాలకు నిలయంగా మారిందా? యాజమాన్యం కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదా? నల్లబంగారం అందించే కార్మికుల ప్రాణాలకు విలువే లేదా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా 10 రోజుల వ్యవధిలో నాలుగు ప్రమాదాలు జరగడం విస్మయం కలిగిస్తోంది. దీంతో సింగరేణిలో ఏం జరుగుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాసిపేట మండలం కల్యాణి ఖని ఉపరితల బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. షవర్ ఆపరేటర్ మట్టి పోస్తుండగా మట్టి కుప్ప కింద…
సింగరేణి గనుల్లో మరో ప్రమాదం జరిగింది.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఇవాళ ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు.. ఈ ప్రమాదంలో గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్‌పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్‌మెన్ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్ మృతిచెందారు.. పై కప్పు…
పదవీ విరమణ వయస్సు 61 యేండ్లకు పెంపు పై సింగరేణి భవన్ లో సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన బోర్డు సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో పదవి విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతూ ఈ సందర్భంగా బోర్డు నిర్ణయం తీసుకుంది. బోర్డు నిర్ణయం ప్రకారం… పెంచిన వయస్సు మార్చి 31, 2021 నుండి అమల్లోకి రానుంది. అలాగే మార్చి 31 జూన్ 30వ తేదీ మధ్య కాలంలో రిటైర్మెంట్ తీసుకున్న 39…
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు.. సింగరేణి ఉద్యోగులు, కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు.. ఈ మేరకు ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్‌లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు.. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనున్నది.…