డిసెంబర్ 9వ తేదీ చిన్న సినిమాలు వెల్లువెత్తబోతున్నాయి. ఇప్పటికే ఎనిమిది స్ట్రయిట్ సినిమాలతో పాటు రెండు కన్నడ అనువాద చిత్రాలూ వస్తుండగా, తాజాగా వీటితో అరుణ్ విజయ్ నటించిన తమిళ చిత్రం కూడా జత అయ్యింది. తమిళ చిత్రం 'సినం' తెలుగులో 'ఆక్రోశం' పేరుతో డబ్ అయ్యి 9వ తేదీ విడుదల కాబోతోంది.